Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ రామన్నపేట
ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం సేవలను అందరి సహకారంతో విస్తృతపరుస్తామని, ఇందుకోసం రైతులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకారం అందించాలని పీఏసీఎస్ చైర్మెన్ నంద్యాల భిక్షంరెడ్డి కోరారు.మంగళవారం మండలకేంద్రంలో అ సంఘం అర్థవార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సీఈవో జంగారెడ్డి ఆదాయ, వ్యయాలను, లాభనష్టాలను వివరించారు. రైతులు ప్రజాప్రతినిధులు పలు సూచనలను ఈ సందర్భంగా చేశారు.రైతుసంఘం నాయకులు కల్లూరు నగేష్ మాట్లాడుతూ ఆదాయ వ్యయాలను గంపగుత్త పద్దుల్లాగా కాకుండా వివరనాత్మకంగా ఖర్చుల వివరాలు సభ్యులందరికీ అందించాలని సూచించారు. అనంతరం భిక్షంరెడ్డి మాట్లాడుతూ ఇప్పటివరకు సంఘం లాభాలతో నడుస్తుందన్నారు.ఈ సమావేశంలో పీఏసీఎస్ వైస్‌చైర్మెన్ అంబటి ఉపేంద్ర రవీందర్‌రెడ్డి, డైరెక్టర్లు కన్నె కంటి వెంకటేశ్వరాచారి, పిట్ట రాంరెడ్డి, నక్క యాదయ్య, కొండల్‌రెడ్డి, పాశంరాంరెడ్డి, నాగు అంజయ్య, కొమ్ము అంజమ్మ, కల్లూరి సైదమ్మ, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మెన్ కంభంపాటి శ్రీనివాస్, వివిధ గ్రామాల సర్పంచులు అప్పంలక్ష్మీనర్సు, మెట్టు మహేందర్‌రెడ్డి, గుత్తా నర్సింహారెడ్డి, పిట్ట కృష్ణారెడ్డి, ఎంపీటీసీ గొరిగేనర్సింహ, మండల కో ఆప్షన్ సభ్యులు ఆమేర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మందడి ఉదరురెడ్డి, పోచబోయిన మల్లేశం, పోతురాజుసాయికుమార్, బోయినిఆనంద్, అంబటిమల్లారెడ్డి, బండ శ్రీనివాస్‌రెడ్డి, ఆవుల నరేష్, కొమ్ముఅంజయ్య, మందడి శ్రీధర్‌రెడ్డి, కూనూరు ముత్తయ్య, బర్లస్వామి, దోమలపల్లి నర్సింహ, దాడి మల్లారెడ్డి పాల్గొన్నారు.