Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నూతనకల్: ప్రభుత్వం నిషేధిత పదార్థమైన నాటు సారాయిని తయారు చేసినా, విక్రయించినవ వారిపై చర్యలు తప్పవని తుంగతుర్తి ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయక్,జిల్లా ట్రాస్క్ఫోర్స్ అధికారి రమేశ్ హెచ్చరించారు. గురువారం మండలపరిధిలో ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో పాల్గొని టీక్యాతండాకు చెందిన భూక్యాసైదా, లావుడ్య, అచ్చమ్మ, లావుడ్య యుగంధర్, మాచినపల్లి గ్రామానికి చెందిన గుగులోత్ మల్సూర్ గుగులోత్ నీలమ్మ ఇండ్లల్లో నిల్వ ఉన్న సుమారు పది లీటర్ల నాటుసారాను, 50 లీటర్ల పానకాన్ని పట్టుకున్నారు.ఐదుగురిపై కేసు నమోదు చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్సైలు మూర్తి, గణేష్, సిబ్బంది పాల్గొన్నారు.