Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షురాలు వెలది పద్మావతి
కోదాడరూరల్ :మండలపరిధిలోని గణపవరం గ్రామంలో గత ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో అధికారులు పేదలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యారని, వెంటనే కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షురాలు వెలది పద్మావతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గురువారం ఆ గ్రామంలోని సర్వేనెంబర్ 429లో పేదలకు కేటాయించిన ఇండ్లస్థలాన్ని ఆమె పరిశీలించి మాట్లాడారు.పేదలకు ఇండ్లు నిర్మించుకోమని ఇచ్చిన స్థలంలో మౌలికసదుపాయాలను ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కోటయ్య, సైదమ్మ, సత్యవతి, అలివేలు, సంతోష్, మరియమ్మ, లక్ష్మీ, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.