Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నూతనకల్
మండలపరిధిలోని ఎర్రపహాడ్ గ్రామంలో భూసంస్కరణలకు ముందు కొనుగోలు చేసిన రైతుల భూవివరాలను ఆర్డీఓ రాజేంద్రకుమార్ గురువారం పరిశీలించారు.జెన్నారెడ్డి శ్యాంసుందర్‌రెడ్డి వద్ద భూ సంస్కరణలకు ముందు కొనుగోలు చేసిన 33 మంది రైతులు భూ హక్కుల కోసం దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం, న్యాయస్థానం ఆదేశాల మేరకు సంబంధిత రైతుల కొనుగోలు, స్వాధీన అనుభవం కలిగిన వివరాలను అడిగి తెలుసుకుని పరిశీలించారు.33 మంది రైతులకు సంబంధించిన సుమారు 150 ఎకరాల భూక్రయ స్వాధీన పత్రాలను పరిశీలించినట్టు తెలిపారు.ఈ పరిశీలనలో తహసీల్దార్ జమీరోద్దీన్, గ్రామసర్పంచ్ గుర్రం సత్యనారాయణ, ఎంపీటీసీ గాడుదుల రజిత, రైతులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.