Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూర్యాపేట:పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చేంతవరకు పోరాడుతామని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి,పట్నం జిల్లా కన్వీనర్ జె.నర్సింహారావు అన్నారు.ప్రజాసంఘాల పోరాటం వేదిక ఆధ్వర్యంలో గురువారం స్థానిక అంబేద్కర్‌నగర్‌లో పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇండ్ల స్థలాలివ్వాలని సర్వే నిర్వహించాలని దరఖాస్తులు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ చేయడంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుందన్నారు.అనేకమంది పేదలు ఇండ్లు, స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఇండ్లు,స్థలాలు,ప్రతి ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలివ్వాలని కోరుతూ ఈనెల 23వ తేదీన జరిగే జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నాలో అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాలనాయకులు శిరంశెట్టి శ్రీనివాస్,భువనేశ్వరి శ్రావణి,ఉమ, సౌమ్య,సైదమ్మ కైరునా, నాగదుర్గ, కవిత, జానిభేగం, సత్తైమ్మ పాల్గొన్నారు.