Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేటరూరల్
సీఎం కేసీఆర్‌తోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.గురువారం మండలంలోని సోలిపేట గ్రామంలో రూ.1.50 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన పశువుల ఆస్పత్రి, ఎస్సీ కమ్యూనిటీహాల్, బస్‌షెల్టర్, అంబేద్కర్ విగ్రహం, గ్రామ ముఖ ద్వారం, కళావేదికలను మంత్రి ప్రారంభిం చారు.వ్యాయమశాల పనులకు శంకుస్థాపన చేశారు.నూతన పెన్షన్, లబ్దిదారులకు గుర్తింపుకార్డులను అందజేసి మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తోందని, గ్రామాలలో నివసిస్తున్న ప్రజల సంక్షేమానికి సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని పథకాలను తెలంగాణలో అమలు చేస్తున్నారని వివరించారు.గోదావరి జలాలతో భూగర్భజలాలు పుష్కలంగా పెరిగాయన్నారు.2014కు ముందు పాలించిన జెండాలు గ్రామాలను నిండా ముంచితే, ప్రతి గ్రామానికి కోట్ల రూపాయలు తెచ్చి అభివృద్ధి చేసింది గులాబీజెండా మాత్రమేనన్నారు.ప్రధాని మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో సైతం నేటికీ వ్యవసాయానికి ఇస్తున్న విద్యుత్ కేవలం 6గంటలు మాత్రమేనని ఎద్దేవా చేశారు.2014కు ముందు మేమే గొప్ప నాయకులమని చెప్పుకునే పాలకుల హాయాంలో కనీసం తాగడానికి నీరు దొరకలేదని ఆరోపించారు.ఈ కార్యక్రమంంలో ఎంపీపీ బీరవోలు రవీందర్‌రెడ్డి, జెడ్పీటీసీ జీడిభిక్షం,డీసీఎంఎస్ చైర్మెన్ వట్టెజానయ్యయాదవ్,యాదగిరిముదిరాజ్, చల్లా సురేందర్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ శ్రీనివాస్‌నాయుడు, సర్పంచ్ శోభారాణి, మాలి అనంతరెడ్డి, చిత్రం వెంకన్న పాల్గొన్నారు.