Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అనంతగిరి
ఈనెల 29న ఆత్మకూర్ఎస్ మండలం నెమ్మికల్లో తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా రెండవ మహాసభలు ఉన్నాయని, జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని కల్లుగీత కార్మికసంఘం జిల్లా ప్రధానకార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు కోరారు.మండలపరిధిలోని త్రిపురవరం గ్రామంలో గురువారం ఆ సంఘం మండల కమిటీ సమా వేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేండ్లుగా కల్లుగీత కార్మికుల హక్కుల సాధనకై అనేక ఉద్యమాలను కొనసాగి స్తున్నామని పేర్కొన్నారు.కల్లు అమ్ముకుంటూ జీవనాధారం కొనసాగించే గీత కార్మికుడికి ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేయుట, ఎక్స్గ్రేషియా పెంపు, సభ్యత్వగుర్తింపుకార్డులివ్వడం, వృత్తిపన్నును రద్దు చేయాలని కోరారు.ఈ సమావేశంలో నాయకులు మట్టపల్లి సైదులు, బెల్లంకొండ నాగేంద్ర ధనమూర్తి, మట్టపల్లినారాయణ, సురభిగురవయ్య, జెర్రిపోతుల నాగేశ్వరరావు,మట్టపల్లి రామకోటయ్య,మామిడి వెంకటేశ్వర్లు, ఉయ్యాల కాశయ్య,మట్టపల్లి వెంకటయ్య, మట్టపల్లి సిద్దయ్య,గుండు సురేష్ పాల్గొన్నారు.