Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 9 విభాగాల్లో గ్రామపంచాయతీ పనితీరు పరిశీలన
- కలెక్టర్ పాటిల్ హేమంత్కేశవ్
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
జాతీయ పంచాయతీ అవార్డులు మన జిల్లాకు అధికంగా అందే విధంగా ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని స్థానిక సంస్థలు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.జాతీయ పంచాయతీ అవార్డుల దరఖాస్తు తదితర అంశాలపై గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.మన సూర్యాపేట జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహించి ఆదర్శ గ్రామాల రూపకల్పనకు కట్టవిట్టమైన చర్యలు చేపట్టామన్నారు.జాతీయ పంచాయతీ అవార్డుల దరఖాస్తు సమయంలో మనం చేసిన పనులను పటిష్టంగా తెలిసే విధంగా డాక్యుమెంటేషన్ చేపట్టాలని అధికారులకు సూచించారు.2030 నాటికి దేశవ్యాప్తంగా స్థిరమైన గ్రామాలను రూపొందించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం 9 విభాగాల్లో గ్రామపంచాయతీ పనితీరు పరిశీలించి అవార్డుల జారీ ప్రక్రియ చేపట్టిందని కలెక్టర్ అన్నారు.పేదరికం లేని మరియు మెరుగైన జీవనోపాధి గ్రామం, ఆరోగ్య గ్రామం, చిన్నారుల ఫ్రెండ్లీ గ్రామం, నీరు సమద్ధిగా ఉన్న గ్రామం , క్లీన్ అండ్ గ్రీన్ గ్రామం, సామాజిక భద్రత కల్గిన గ్రామం, సమద్ధి మౌలిక సదుపాయాలు కలిగిన గ్రామం, సుపరిపాలన గ్రామం, మహిళా ఫ్రెండ్లీ గ్రామం అంశాలలో పనితీరు ఆధారంగా జాతీయ అవార్డుల జారీ ఉంటుందని పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వం ప్రతి అంశానికి సంబంధించి గ్రామాల పనితీరు బేరీజు వేసుకునే వీలుగా ప్రతి విభాగంలో ప్రశ్నలను సిద్ధం చేసుకుందని, వాటి ఆధారంగా గ్రామాలలో క్షేత్రస్థాయి పరిశీలన చేసి అవార్డుల జారీ ఉంటుందని తెలిపారు.ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ సురేష్, డీఆర్డీఏ పీడీ కిరణ్కుమార్, జిల్లాపంచాయతీ అధికారి యాదయ్య, డీఎంహెచ్ఓ కోటాచలం, డీడబ్య్లూఓ జ్యోతిపద, సీపీఓ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓలు, మెడికల్ఆఫీసర్లు, , ఏపీఎంలు,సంబంధిత అధికారులు పాల్గొన్నారు.