Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లిప్టుపనులకు ఆదిలోనే హంసపాదం
నవతెలంగాణ-పాలకవీడు
మండలంలోని గుండెబోయినగూడెం శివారులో తెలంగాణ ప్రభుత్వం పులిచింతల బ్యాక్‌వాటర్ కృష్ణా నది సమీపాన నిర్మిస్తున్న ఎత్తిపోతల పనులకు స్థానిక రైతు,టీఆర్ఎస్ మండలనాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు.ఈ లిఫ్ట్ నిర్మాణంలో తమ సొంత భూములు పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డామని, ప్రభుత్వం నుండి తాము కోల్పోతున్న భూమికి నష్టపరిహారం, ఏ సర్వే నెంబర్లో ఎంత భూమి పోతుందన్న వివరాలు పూర్తికాకముందే పనులు చేపట్టడం ఏంటని నిర్మాణదారులను ప్రశ్నిం చారు.వెంటనే పనులను ఆపాలని కోరారు.లిప్టునిర్మాణంలో భాగంగా మొత్తం 14 కిలోమీటర్ల మేర పైపులైన్, జాన్‌పహాడ్ రహదారి వరకు పైపులైన్ వెంట రోడ్డు నిర్మాణంపై పరిసర గ్రామాల రైతుల్లో ఆందోళన ఉందని,దానిని నివృత్తి చేయాల్సిన బాధ్యత, ప్రభుత్వ అధికారులు, కాంట్రాక్టర్లపై ఉందన్నారు.స్థలపరిశీలనకు వచ్చిన తహసీల్దార్ శ్రీదేవి, ఆర్ఐ జానీపాషా, సర్వేయర్, రెవెన్యూ సిబ్బంది ,లిఫ్ట్ నిర్మాణానికి అవసరమై 65వ సర్వే నెంబర్ అని భావిస్తూ సుమారు ఐదెకరాలకు డిజిటల్ సర్వే ప్రకారం నిర్మాణదారులు చూపెట్టిన హద్దులను, పెగ్ సిస్టంద్వారా సర్వే చేశారు. ఈ రిపోర్ట్‌ను ప్రభుత్వానికి పంపిస్తామని తహసీల్దార్ స్పష్టం చేశారు.ప్రభుత్వం సుమారు 185 కోట్ల రూపాయలతో చేపడుతున్న ఈ లిఫ్ట్ ద్వారా మండలంలోని నాగార్జునసాగర్ ఎడమ కాలువ పదోనెంబర్ చివరి ఆయకట్టు భూములు 6000 ఎకరాలకు పైగా నీటి సమస్య తీరుతుందని నీటిపారుదల శాఖ ఏఈఈ కురుమయ్య తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన దేవిరెడ్డి వెంకట్ రెడ్డి, భోగాల వెంకట్‌రెడ్డి, తాటికొండ వెంకట్‌రెడ్డి, రైతులు ప్రశాంత్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.