Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం సుమారు రూ.2.50 లక్షల విలువైన 20 ఐరన్ స్టాపర్లను నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం బహూకరించింది.గురువారం స్థానిక నారాయణ విద్యాసంస్థల కళాశాల లో ఏజీఎం వెంకటరమణారెడ్డి, రీజినల్ ఇన్చార్జి రమేశ్‌రెడ్డిల ఆధ్వర్యంలో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు స్టాపర్లను అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా పోలీస్ యంత్రాంగం తరపున డీఎస్పీ నాగభూషణం వారిని అభినం దించడంతో పాటు శాలువా కప్పి సన్మానించారు.ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ రాజశేఖర్,నారాయణ కళాశాల ప్రిన్సిపాల్ పుష్పలత, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రెహముద్దిన్,ఎస్సైలు క్రాంతికుమార్, శ్రీనివాస్, సైదులు, యాకుబ్,జహంగీర్, సతీష్, రవీందర్‌రెడ్డి, సరిత, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.