Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధర్నాను జయప్రదం చేయండి
- తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక జిల్లా కన్వీనర్ మల్లునాగార్జునరెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్ 5 నుండి 22 వ తేదీ వరకు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్వహించిన సర్వేలో వచ్చిన సమస్యల పరిష్కారం కోసం నేడు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నారు.ఈ క్రమంలో సర్వేలో వచ్చిన సమస్యలపై సెప్టెంబర్ 19 నుండి 22 వరకు మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో సుమారు 500 పైగా సమస్యలు ప్రజాసంఘాల దృష్టికి వచ్చాయి.ఈ సర్వే 23 మండలాల్లో నాలుగు మున్సిపాలిటీలలో నిర్వహించారు. ఇందులో సూర్యాపేట జిల్లావ్యాప్తంగా ఉన్న పూర్తికాలం కార్యకర్తలు మండలబాధ్యులు 20 రోజుల పాటు దగ్గర గ్రామాలు ఆవాస ప్రాంతాలు, గిరిజన తండాలు, దళితవాడలు తిరిగి ప్రజా సమస్యలను తెలుసుకొని వారి నుండి దరఖాస్తులు స్వీకరించారు.గురువారం స్థానిక ఎంవీఎన్.భవన్లో తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక జిల్లా కన్వీనర్ మల్లు నాగార్జునరెడ్డి 'నవతెలంగాణ'తో మాట్లాడారు.జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన సర్వే లో వచ్చిన ప్రజా సమస్యలపై 23వ తేదీన జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ప్రధానంగా జిల్లాలో అభివృద్ధి పేరుతో పల్లె ప్రకృతివనం,క్రీడామైదానం, రైతువేదిక,వైకుంఠదామం, అంగన్వాడీ, గ్రామపంచాయతీ పశు వైద్యశాలల కోసం పేదల ఆధీనంలో ఉన్న భూములను తీసుకునే ఆలోచనను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు.జిల్లావ్యాప్తంగా పెండింగ్లో ఉన్న మరుగుదొడ్లు,,ఇంకుడు గుంతల, ఉపాధికూలీల పెండింగ్ మెడికల్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరారు.పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజురీయీంబర్స్మెంట్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.సంక్షేమ వసతి గహాలకు పక్కాభవనాలు నిర్మించి మెస్,కాస్మోటిక్ చార్జీలను పెంచాలని కోరారు.ప్రభుత్వ పాఠశాలల్లో యూనిఫామ్స్ పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాలని కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థలోఅధిక ఫీజుల దోపిడీని అరికట్టాలని కోరారు..మధ్యాహ్న భోజన పెండింగ్ బిల్లులు విడుదల చేయాలన్నారు.వ్యవసాయం చేసే రైతులు అందరికీ లక్ష రూపాయల వెంటనే రుణమాఫీ చేయాలని,రైతులు అందరికీ వడ్డి లేని రుణాలు ఇవ్వాలని పేర్కొన్నారు.సన్న చిన్న కారు రైతులకీ సబ్సిడీ లేకుండా ఎరువులు ఇవ్వాలని,కౌలు రైతులకు కూడా రుణాలు, గుర్తింపు కార్డులు ఇవ్వాలని తెలిపారు.ధరణి పోర్టల్లో ఉన్న వ్యవసాయ భూముల సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని కోరారు.వ్యవసాయం పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలని వ్యవసాయం చేసి ప్రతి రైతుకు 55 ఏండ్ల వయస్సు వారికి వృద్ధాప్య పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా దళితులందరికి దళిత బంధు ద్వారా 10 లక్షల రూపాయలు ఇవ్వాలన్నారు.ప్రతి దళిత కుటుంబానికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని దళితులందరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని పేర్కొన్నారు.కులాంతర వివాహం చేసుకున్న జంటలకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకం 2.50 లక్షల రూపాయలు వెంటనే విడుదల చేయాలన్నారు.ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి దళిత వాడలు అభివద్ధి చేయాలని కోరారు. పెండింగ్ లో ఉన్న ఎస్సీ కార్పోరేషన్ రుణాలు వెంటనే విడుదల చేయాలన్నారు.2022-23 ఎస్సీ కార్పోరేషన్ యాక్షన్ ప్లాన్ విడుదల చేయాలి.బ్యాంక్ లింక్ లేకుండా అందరికీ రుణాలు ఇవ్వాలని కోరారు.ప్రతి కల్లు సొసైటీకి 5 ఎకరాల భూమి ఇవ్వాలని ఆ భూమిలో పొట్టి వంగడాలు తాటి ఈత జీలుగు చెట్లను పెంచాలన్నారు.18 సంవత్సరాలు దాటిన కల్లుగీత కార్మికులకి సభ్యత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పారు. గీతన్న బందు ప్రకటించి కుటుంబానికి 10 లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు.జిల్లా కేంద్రంలో తాటి ఈత ఉత్పత్తుల కేంద్రాలు ఏర్పాటు చేయాలని,నిరుపేద కల్లు గీత కార్మికులకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు.50 ఏండ్లు దాటిన కల్లుగీత కార్మికులకు 5000 రూపాయల వృత్తి పెన్షన్ ఇవ్వాలని పేర్కొన్నారు.ప్రతి గ్రామంలో నీరా కేంద్రాలు ఏర్పాటు చేయాలని,ప్రభుత్వమే కల్లుకు మార్కెట్ సౌకర్యం కల్పించాలని తెలిపారు. గీత కార్పొరేషన్ కు ప్రభుత్వం ఐదు వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ స్థలాల లో గుడిసెలు వేసుకున్న వారికి వెంటనే పట్టాలు ఇవ్వాలి. వీరి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని అర్హులైన పేదలందరికీ 120 గజాల ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలన్నారు. పేదల ఇండ్ల నిర్మాణం కోసం నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే ప్రారంభించి, అసంపూర్తిగా ఉన్న ఇళ్లను త్వరత గతిన పూర్తి చేయాలని కోరారు.అర్హులైన పేదలందరికీ వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, ఒంటరి మహిళ ,చేతి వృత్తిదారుల పింఛన్లు ఇవ్వాలని,అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఉపాధి కూలీలకు 200 రోజులు పని కల్పించి రోజు కూలి . రూ 600 ఇవ్వాలన్నారు.అంటు వ్యాధులు, విష జ్వరాల భారీ నుండి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలని పేర్కొన్నారు.వ్యవసాయ కార్మికుల సంక్షేమానికి సమగ్ర శాసన చట్టం చేయాలని,కూలి బందు పథకం ద్వారా భూమిలేని పేదలందరికీ 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ, పోరంబోకు, దేవాలయ, పంచరాయి ,చెరువు శిఖం, అసైన్డ్ భూములను కలిగి ఉండి వ్యవసాయం చేసుకుంటున్న పేద ,వ్యవసాయ కార్మికులకు కొత్త పాస్ పుస్తకాన్ని ఇచ్చి రైతుబంధు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు.ప్రతి ఒక్కరూ సమస్యల పరిష్కారం కోసం నేటి ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.