Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్యే జూలకంటిరంగారెడ్డి
నవతెలంగాణ-నేరేడుచర్ల
గడ్డం లక్ష్మీనరసయ్య తను నమ్మిన సిద్ధాంతం కోసం చివరిదాకా పనిచేశారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు.గరిడేపల్లి మండలం వెల్దండ గ్రామంలో గురువారం జరిగిన గడ్డం లక్ష్మీనర్సయ్య మూడోవర్థంతిసభలో ఆయన మాట్లాడారు. ప్రపంచంలో మార్క్సిజాన్ని మించిన సిద్ధాంతం మరొకటి లేదన్నారు.మానవ వ్యవస్థలో అందరూ సమానంగా బతకాలంటే అందరికీ విద్యా, వైద్యం సమానంగా అందాలంటే అది కమ్యూనిజం ద్వారానే సాధ్యమన్నారు.లక్ష్మీనర్సయ్య తమ సమకాలికులైన మేదరమెట్ల సీతారామయ్య, యానాలనర్సయ్య, దేవారం మల్సూర్‌లతో పాటు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ పోరాటంలో పాల్గొని అనేక అవస్థలు పడుతూ పోరాటం చేసిన వ్యక్తి లక్ష్మీ నరసయ్య ని కొనియాడారు.వెలిదండ గ్రామానికి లక్ష్మీనర్సయ్య భౌతికంగా మన ముందు లేకపోయినా ఆయన పేరుమీద లక్షా ఇరవై వేల రూపాయల బాడీ ఫ్రీజర్ బాక్స్ (శవాన్ని భద్రపరిచే పెట్టే) గ్రామానికి డొనేట్ చేయటం హర్షించదగ్గ విషయమన్నారు.కుటుంబసభ్యులు ఓ మంచి నిర్ణయం తీసుకొని ముందుకురావడం మంచి పరిణామమన్నారు.మండల కార్యదర్శి యాకుబ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, పారేపల్లి శేఖర్‌రావు,నెమ్మాది వెంకటేశ్వర్లు, ఎం.వెంకటేశ్వరరావు, పల్లె వెంకట్‌రెడ్డి, కె.నగేష్, మేకలనాగేశ్వరరావు,స్థానిక సర్పంచ్ ఆదూరి పద్మ కోయిలఅర్జున్, యానాల సోమయ్య,రాజేష్, కుటుంబసభ్యులు గడ్డంఅనిల్,టీఆర్ఎస్ నాయకులు పార్థసారథి,మాజీ సర్పంచ్ అంజయ్య, ఏల సోమయ్య, అంబటి భిక్షం, ముత్యాలు,హుస్సేన్ పాల్గొన్నారు.