Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- నకిరేకల్
టిపిసిసి సభ్యులుగా నియమితులైన కొండేటి మల్లయ్య, సుంకర బోయిన నరసింహ యాదవ్ లను గురువారం పట్టణంలోని మల్లయ్య నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 21న పిసిసి ప్రతినిధుల సమావేశం హైదరాబాదులో జరిగిందన్నారు. ఈ సమావేశంలో ఏఐసిసి అధ్యక్షులుగా రాహుల్ గాంధీ నియామకానికి పార్టీ ఏకగ్రీవ తీర్మానం చేసిందన్నారు. సన్మానించిన వారిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బెల్లి సుధాకర్, లింగాల వెంకన్న, నకిరేకంటి శ్రీను, వంగూరి రాంప్రసాద్, బొప్పన యాదగిరి, వంటపాక తిరుమలేష్, సైదులు, సుధాకర్ పాల్గొన్నారు.