Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ
నవతెలంగాణ-మునుగోడు
గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న కార్మికులపై పనిభారం పెరిగిందని, ప్రభుత్వం ప్రకటించిన విధంగా పేస్కేల్ అమలు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.జీపీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ మండల మహాసభ చలిచీమల శంకరయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ కార్మికులు పారిశుధ్యం నర్సరీ ,మంచినీటి, సరఫరా వీధి దీపాల నిర్వహణ, పన్నుల వసూలు,ఆఫీస్ నిర్వహణ తదితర కేటగిరీలలో ఎంతో కష్టపడి పనిచేస్తున్నారని వీరి పట్ల మాత్రం ప్రభుత్వం కపట ప్రేమ ప్రదర్శిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పల్లె ప్రగతి డంపింగ్ యార్డ్ తదితర కార్యక్రమాల్లో జిపి కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పి ఆర్ సి కమిటీ సిఫారసుల ప్రకారం జీవో నెంబర్ 60 ఇచ్చిందని దీనికనుగుణంగా కేటగిరీల వారీగా 15600 ,19500, 22750 వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ యాసరాణి శ్రీనివాస్, మండల నాయకులు వరికుప్పల ముత్యాలు యూనియన్ నాయకులు రెడ్డి మల్ల యాదగిరి, కంభంపాటి లక్ష్మయ్య, రావిరాల శ్రీనివాస్, ఎర్ర ఎర్రగోనీ లింగయ్య, అండాలు, పెద్దమ్మ, లక్ష్మీ ,సుజాత తదితరులు పాల్గొన్నారు.