Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి
నవతెలంగాణ- నల్లగొండ
రాష్ట్ర దేవాలయ ధర్మాదాయ శాఖ అర్చక సంక్షేమ బోర్డు మెంబర్‌గా శ్రవణ్ కుమార్ నియామకం సంతోషకరమైన విషయమని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవనంలో రాష్ట్ర దేవాలయ ధర్మాదాయ శాఖ అర్చక సంక్షేమ బోర్డు మెంబర్‌గా నియమింపబడిన ధరేశ్వరపురం రేణుక ఎల్లమ్మ దేవాలయం అర్చకులు శ్రవణ్ కుమార్ ఆచార్యులను. సన్మానించి మాట్లాడారు. ఇక్కడి అర్చకుల స్థితిగతులను వారి ఇబ్బందులను బోర్డులో చర్చించి పరిష్కరించే అవకాశం లభించిందన్నారు. కేసీిఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అటు బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు చేసి ఎంతోమంది పేద బ్రాహ్మణులకు ఉపాధి కల్పించే ఆర్థిక వెసులుబాటును కల్పించారన్నారు. అదేవిధంగా ధూప దీప నైవేద్యం స్కీం లో కొత్త వాటితో కలుపుకొని రాష్ట్రం లో 4000 దేవాలయాలకు, అర్చకులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. బ్రాహ్మణులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో మున్సిపల్ చైర్మెన్‌్ మందడి సైదిరెడ్డి, గ్రంథాలయం చైర్మెన్ రగట్టే మల్లిఖార్జున రెడ్డి, నల్గొండ ఎండో మెంట్ అసిస్టెంట్ కమిషనర్,టీయన్ జీవో జిల్లా అధ్యక్షలు శ్రవణకుమార్, రాష్ట్ర అర్చక సంఘ అధ్యక్షులు ఉపేంద్ర శర్మ, ఉపాధ్యక్షులు వాసుదేవ శర్మ, మోహన్ శర్మ, రామలింగేశ్వర శర్మ తదితరులు పాల్గొన్నారు.