Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
ఇంటర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గురువారం డీఐసీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్ కంభంపాటి శంకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ విద్యా సంవత్సరం ప్రారంభమై దాదాపు నాలుగు నెలలు పూర్తికావస్తున్న ప్రథమ,ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు నేటికీ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పాఠ్యపుస్తకాలు అందించలేదన్నారు. విద్యా సంవత్సరం క్యాలెండర్ నేటికీ విడుదల చేయకుండా ప్రణాళికలు రూపొందించకుండా ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కాలయాపన చేస్తున్నారన్నారు. సకాలంలో పాఠ్య పుస్తకాలు అందిస్తే ప్రభుత్వ విద్య కార్పొరేట్ విద్యాసంస్థల కంటే దీటుగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయన్నారు.ఈకార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శులు బిట్టు రేణుక, స్పందన జగన్ కొటేష్ కిరణ్ కుమార్ అజరు జగదీశ్ శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.