Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి
నవతెలంగాణ- నకిరేకల్
జిల్లాలో ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ హాస్టల్స్ లో మెనూ పాటించక పోవడం వలన నాణ్యమైన ఆహారం విద్యార్థులకు అందడం లేదని వెంటనే మెను విడుదల చేయాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలో ఎస్సీ, బీసీ సంక్షేమ హాస్టల్స్ సందర్శించి విద్యార్థిని విద్యార్థులతో మాట్లాడారు.సంక్షేమ హాస్టల్స్ లో టిఫిన్స్ పెట్టకుండా ప్రతిరోజూ ఉదయం టిఫిన్స్ కు బదులుగా ప్రతిరోజూ వరి అన్నం నీళ్ల చారు పెడుతున్నారన్నారు.ఒక కేజీ మంచినూనె మూడురోజులు వందమంది విద్యార్థులకు వండిపెడుతున్న సమాచారం వచ్చిందని అన్నారు.పై అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వలన విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందటం లేదని అన్నారు. నేటికీ బట్టలు చెప్పులు షఉస్ ప్లేటూ గ్లాసూ పెట్టెలు కాస్మోటిక్స్ బిల్ ఇవ్వలేదని అన్నారు. పదవ తరగతి చదువుతున్న వారికి ట్యూటర్ సున్నం పెట్టడం లేదని ఒకరితో అన్ని సబ్జెక్టులు చెప్పించడం సరిఅయిన పద్ధతి కాదని అన్నారు. నకిరేకల్ లో ఎస్సీ విద్యార్థినుల హాస్టల్ వర్షానికి కురుస్తుందని వెంటనే బిల్డింగ్ మార్పిడి చేయాలని డిమాండ్ చేశారు.తాగునీటి ఆర్వో ప్లాంట్లు చెడిపోయినప్పటికీ బాగుచేయించడంలేదని అన్నారు. కంప్యూటర్ హాళ్లు తెరిచే పరిస్థితి లేదని కంప్యూటర్లు నిరూపయోగంగా ఉంటున్నాయని వెంటనే శిక్షణ ఇవ్వాలని అన్నారు. సంక్షేమ హాస్టల్ సమస్యలపై జిల్లావ్యాప్తంగా సర్వేలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు త్వరలో ధర్నా నిర్వహిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ మండల కార్యదర్శి వంటెపాక క్రిష్ణ, మాచర్ల శంకర్, నాగేశ్ తదితరులు పాల్గొన్నారు.