Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫ్లోరోసిస్ ను పారదోలిన చరిత్ర కేసీఆర్ ది
- రాష్ట్రప్రభుత్వంపై కేంద్రం కుట్ర మంత్రి జగదీశ్ రెడ్డి
నవతెలంగాణ -సంస్థాన్‌నారాయణపురం
ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశానికే తలమానికమని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన టీిఆర్‌ఎస్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం (వనభోజనాలు)కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు బతుకమ్మలు, బోనం కుండలు, పీర్లు ఊరేగింపులు, కోలాటం ఆటపాటలు, ఒగ్గు కళాకారుల నృత్యాలతో కోలాహాలంగా చేరుకున్నారు. వివిధ రకాల కళాకారులు ఆటపాటలతో వనభోజన స్థలం వద్ద ఏర్పాటుచేసిన వేదికపై తమ కళలను ప్రదర్శించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం జాతరలు, బోనాలు,పండుగలు వంటి సాంస్కృతిక సాంప్రదాయాలకు నిలయమన్నారు. సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణలో భాగంగానే వనభోజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రజల ఐక్యతను చూసి ఓరువలేని కేంద్రంలోని బీజేపీి ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వంపై కుట్రపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. బీజేపీ కుట్రలను ఐక్యమత్యంతోనే ఎదుర్కొనేందుకు ప్రజల సిద్ధంగా ఉండాలన్నారు. ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయలేని బీజేపీ ప్రభుత్వం టీిఆర్‌ఎస్ ప్రభుత్వం పై దాడులు ,దౌర్జన్యాలు చేస్తుందన్నారు.బిజెపి అధికారంలో ఉన్న గుజరాత్, మధ్యప్రదేశ్,ఉత్తరప్రదేశ్,రాజస్థాన్ వంటి అనేక రాష్ట్రాల్లో ప్రజలకు రూ.500 నుంచి 600 మాత్రమే పెన్షన్లు ఇస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు ఇవ్వకపోను మోటార్లకు మీటర్లు బిగించి బిల్లులు వసూలు చేస్తున్నట్టు చెప్పారు. అక్కడి రైతులు ఆ ప్రభుత్వాలను బిజెపి తెలంగాణ రాష్ట్రంలో మోటార్లకు మీటర్లు పెట్టాలని ఎంత ఒత్తిడి చేసినా ముఖ్యమంత్రి ఒప్పుకోకపోవడంతో బీజేపీి దాడి చేస్తుందన్నారు.రాష్ట్రానికి రావలసిన నిధులు, విద్యుత్ వాటాలను కేంద్రం ఇవ్వడం లేదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్ర ప్రజల సైతం దేశ రాజకీయాల్లోకి కెసిఆర్ ను రావాలని కోరుతుండడంతో మింగుడు పడడం లేదన్నారు. దేశ రాజకీయాల్లో అడుగు పెట్టకుండా కేసీఆర్ ను ఇబ్బందులకు గురిచేయాలనే దురుద్దేశంతోనే మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందన్నారు.టీిఆర్‌ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ఐక్యంగా ఉండి కెసిఆర్ చేసే అభివద్ధి, పోరాటాల్లో భాగస్వాములన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్, రెడ్డి, హుజూర్ గర్ ఎమ్మెల్యే శాంపుడి సైదిరెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ జక్కిడి జంగారెడ్డి, ఎంపీపీ గుత్త ఉమా, జడ్పిటిసి వీరమల్ల భానుమతి, మాజీ జెడ్పీటీసీ గొల్ల శివశంకర్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కోసుకుంట్ల సత్తిరెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు కత్తుల లక్ష్మయ్య పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కళాకారులు, మహిళలు యువకులు పాల్గొన్నారు.