Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- దేవరకొండ
ప్రభుత్వ గిరిజన ఆశ్రమ, కస్తూర్బా గాంధీ వసతిగృహాల్లో, పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ దేవరకొండ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఆర్డీఓ కార్యాలయంలోని డీటీ అయ్యూబ్కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు వలమల్ల ఆంజనేయులు మాట్లాడారు.నియోజకవర్గంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ, కస్తూర్బాగాంధీ వసతిగృహాల్లో సమస్యలు నిలయాలు మారాయన్నారు.కనీసం మౌలికవసతులు లేక అందులో విద్యను అభ్యసిస్తున్న గిరిజన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.వినతిపత్రం అందజేసిన వారిలో ఆ సంఘం డివిజన్ అధ్యక్షులు సూరిగి వినరు, కార్యదర్శి ఎస్కె.షంశుద్దీన్, నల్లగాసుసైదులు, ఎం.కపిల్, మధు, అజరు తదితరులు పాల్గొన్నారు.