Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
ఈనెల 23న కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పోలేబోయిన వరలక్ష్మీ కోరారు.గురువారం మిర్యాలగూడ సీపీఐ(ఎం) ఆఫీసులో నిర్వహించిన ఆయన మాట్లాడారు.ఇండ్లు, స్థలాలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ప్రభుత్వ స్థలాలలో గుడిసెలు వేసుకున్న పేదలకుపట్టాలివ్వాలని కోరారు.ఇంటి స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో గాదె పద్మ, అరుణ, జిల్లా కమిటీ సభ్యురాలు ఓగోటి పూలమ్మ, కరిమున్నిసా తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా ఇండ్లు, స్థలాలు, డబుల్బెడ్రూం ఇండ్ల సాధన కోసం నేడు కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాకు పేదలు వేలాదిగా తరలిరావాలని మిర్యాలగూడ టూ టౌన్ ఐద్వా కార్యదర్శి పాదూరు గోవర్ధన కోరారు. ప్రభుత్వ స్థలాలలో గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలివ్వాలని, ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని, అర్హులైన పేదలందరికీ 120 గజాల ఇంటి స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఐద్వా ఉపాధ్యక్షురాలు కంచర్ల ఊర్మిళ వేములపల్లి ఐద్వా మండల కార్యదర్శి చలబొట్ల చైతన్య ఐద్వా సభ్యురాలు పొదిల లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.