Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాంపల్లి:గిరిజన రిజర్వేషన్ల పెంపు చారిత్రాత్మకమైన నిర్ణయం అని దీనితో ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనులకు ఆరాధ్య దైవం అయ్యారని ట్రైకార్ చైర్మెన్ ఇస్లావత్ రామచందర్నాయక్ అన్నారు.మండల కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. గిరిజనులకు రిజర్వేషన్ల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోకు కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు.రిజర్వేషన్ల పెంపు బిల్లును ఏడేండ్లుగా కేంద్రం తొక్కి పెట్టడం చాలా దారుణమైన చర్య అని అన్నారు.గిరిజనబంధుతో గిరిజనుల జీవితాలలో కొత్త వెలుగులు ప్రసరిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.ఉమ్మడి రాష్ట్రంలో బంజారా భవన్ నిర్మానానికి 1000 గజాల స్థలం కోసం గత ప్రభుత్వాల చుట్టూ ఏండ్ల తరబడి తిరిగినా ఫలితం లేకపోయిందన్నారు.ఈ కార్యక్రమంలో మండలఅధ్యక్షులు గుమ్మడపు నర్సింహారావు, ముష్టిపల్లి ఎంపీటీసీ రామావత్ బుజ్జిచందులాల్, సర్పంచులు రమావత్ సుగుణశంకర్నాయక్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్ తావుర్యానాయక్, రాపోతు సత్యనారాయణ, గ్రామశాఖ అధ్యక్షులు రమావత్ హతీరామ్, మెగావత్ బాలాజీ, జగన్నాయక్, సపావత్ శ్రీనివాస్, మెగావత్ భాష, హనుమంతు, మార్కెట్ డైరెక్టర్ కోడావతి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.