Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికులతో వేతన ఒప్పందం చేసుకోవాలి
- సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్ కార్మికుల సమ్మె ప్రారంభం
నవతెలంగాణ- చౌటుప్పల్ రూరల్
కార్మికుల వేతనం ఒప్పంద ముగిసిన కూడా కొత్త ఒప్పందం చేసుకోవడానికి ప్రతిష్ట ఇండిస్టీ యజమాన్యం ముందుకు రాకపోవడం దారుణమని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్ ఆరోపించారు. చౌటుప్పల్ మండలం పరిధిలోని ప్రతిష్ట ఇండిస్టీస్ యాజమాన్య మొండివైఖరికి నిరసనగా కార్మికులు సమ్మె చేపట్టారు. సందర్భంగా వారు మాట్లాడుతూ గత 11 నెలలుగా కార్మికులతో వేతన ఒప్పందం చేసుకోకుండా నిర్లక్ష్యం ప్రదర్శించడం తగదన్నారు. కార్మికులకు కనీసం సౌకర్యాలు కల్పించకుండా కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం చేయడం ఏంటని ప్రశ్నించారు. ఎన్నిసార్లు చర్చలు జరిపినప్పటికీ యాజమాన్యం కార్మికులకు కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం మూలంగా విధి లేని పరిస్థితుల్లో కార్మికులు సమ్మె నోటీసు ఇచ్చి సమ్మె చేపట్టడం జరుగుతుందని తెలిపారు. కాంట్రాక్టు కార్మికులతో 12 గంటలు పని చేయించుకుంటున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ 26వేలు ఇవ్వాలని కోరారు. ప్రతిష్ట కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం వీడనాడి కార్మికులకు వేతన ఒప్పందం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రతిష్ట యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కల్లూరు మల్లేశం, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి పాషా, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు ఆదిమూలం నందీశ్వర్, ప్రతిష్ట యూనియన్ ప్రధాన కార్యదర్శి గడ్డం వెంకటేశం, నాయకులు డివియం, యాదయ్య, సత్యనారాయణ, లలిత, శ్రీనివాస్, దామోదర్, బిక్షపతి, పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు.