Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నార్కట్పల్లి
తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతూ ఏడు సంవత్సరాలుగా పదోన్నతులు, నాలుగు సంవత్సరాలుగా బదిలీలు, 15 ఏళ్లుగా పరిరక్షణ అధికారుల పోస్టులు భర్తీ కాక విద్యాశాఖలో తీవ్ర సంక్షోభం నెలకొన్నదని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎం రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నార్కట్ పల్లి మండలం యుటిఎఫ్ మండల మహాసభ మండల అధ్యక్షులు ఎస్. భానుప్రకాష్ అధ్యక్షత నిర్వహించారు. ఈ మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన రాష్ట్రపతి ఉత్తర్వులు 2018 ప్రకారం బదిలీలు పదోన్నతులకు గల ఆటంకాలు తొలగిపోయాయని పేర్కొన్నారు. విద్యాశాఖలో నెలకొన్న సంక్షోభ మార్గం సుఖం ఏమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మార్చి 10. 2022 న అసెంబ్లీలో పదోన్నతులు బదిలీలు చేస్తామని ప్రకటించారు. ప్రకటన అమలు చేయకుండా పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే పదోన్నతులు బదిలీలు షెడ్యూల్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ మహాసభలో జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమర్ల వెంకటేశం, జిల్లా కోశాధికారి నర్రా శేఖర్ రెడ్డి, ఎన్ ఎఫ్ డబ్ల్యూ టి కన్వీనర్ ఈ జయలక్ష్మి, ఆడిట్ కమిటీ కన్వీనర్ ముర్తయ్య, కార్యదర్శి గేరా నరసింహ, మండల ప్రధాన కార్యదర్శి విజయపాల్, హెచ్ఎం వెంకట్ రెడ్డి, వెంకన్న పాల్గొన్నారు.