Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
నల్లగొండ పట్టణంలోని సిద్ధార్థ డిగ్రీ, పీజీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో బతుకమ్మ పండగ ఉత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల చైర్మెన్ గుండెబోయిన లింగయ్య మాట్లాడుతూ ప్రపంచంలో ప్రకృతిని ఆరాధించే అరుదైన పండుగ ఏది అంటే ఏమాత్రం సందేహం లేకుండా చెప్పే పండుగ బతుకమ్మ పండుగ అన్నారు. బతుకమ్మ అంటే పకృతే ఆడపిల్లలను బతుకు అమ్మ అని మనసారా ఆశ్వీరదించే పండుగ ఈ బతుకమ్మ పండుగ అని అన్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్, డైరెక్టర్ గుండెబోయిన జానయ్యలు మాట్లాడుతూ తెలంగాణ ఆచార సాంప్రదాయాలకు ప్రతీక, ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే పూల పండుగ వేడుక ఈ బతుకమ్మ పండుగ అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది యాదగిరి, జుబేర్, కృష్ణయ్య, ఖాన్, శేఖర్ ,శ్రావణి, రమ్య ,అస్మా, రమాదేవి, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.