Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోత్కూరు:మున్సిపాలిటీలో నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్ లబ్ధిదారులకు శుక్రవారం మున్సిపల్ చైర్పర్సన్ తీపిరెడ్డి సావిత్రిమేఘారెడ్డి నూతన కార్డులు పంపిణీ చేశారు. మున్సిపాలిటీలోని 2, 6, 7, 10, 11, 12వార్డుల్లో నూతన లబ్ధిదారులకు కౌన్సిలర్లతో కలిసి పింఛన్ కార్డులు అందజేశారు. మున్సిపాలిటీలో సుమారు 500 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సి.శ్రీకాంత్, కౌన్సిలర్లు గుర్రం కవితలక్ష్మీ నర్సింహారెడ్డి, బొడ్డుపల్లి కల్యాణ్ చక్రవర్తి, వనం స్వామి, కారుపోతులశిరీషశ్రీను, వనం స్వామి, కూరెళ్ల కుమారస్వామి, కోఆప్షన్ మెంబర్ గనగాని నర్సింహ తదితరులుపాల్గొన్నారు.