Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -రామన్నపేట
ఈనెల 26 నుండి 29 వరకు మండలంలోని సిరిపురం గ్రామంలో ఆరుగురు ట్రైనీ ఐఏఎస్ అధికారులు పర్యటించనున్నందున మండల గ్రామస్థాయి అధికారులు తమ శాఖకు సంబంధించిన సమగ్ర నివేదికలతో సిద్ధంగా ఉండాలని డిఆర్డిఓ ఉపేందర్ రెడ్డి అధికారులకు సూచించారు. శుక్రవారం మండలంలోని సిరిపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో మండల గ్రామస్థాయి వివిధ శాఖల అధికారులతో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ శాఖ పరిధిలోని ప్రతి అంశంపై సమగ్ర నివేదిక సిద్ధంగా ఉంచడంతోపాటు ప్రతి అంశంపై అవగాహన కలిగి ఉండాలని ట్రైని ఐఏఎస్ లకు అన్ని సమగ్రంగా వివరించాలని ఆయన తెలిపారు. గ్రామ సర్పంచ్ అప్పం లక్ష్మీ నర్సు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ఎంపీపీ జ్యోతి, జడ్పీటీసీ పున్న లక్ష్మీ, అధికారులు నాగిరెడ్డి, ఆంజనేయులు, జలందర్ రెడ్డి, ఉపసర్పంచ్ దాసిరెడ్డి శ్రవణ్ కుమార్ రెడ్డి, వార్డు సభ్యులు గుంజే రాధ సైదులు, సంగిశెట్టి శ్రావణి సత్యనారాయణ, పగుడాల శివ గణేష్, పోలేపాక పద్మ క్రిష్ణ, తదితరులు పాల్గొన్నారు.