Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ఎస్టీ కార్పొరేషన్ చైర్మెన్ ఇస్లావత్ రామచందర్ నాయక్
నవతెలంగాణ- సంస్థాన్ నారాయణపురం
గిరిజనుల ఆరాధ్య దైవంగా భావించే సంత్ సేవాలాల్ మందిర దర్శనానికి గిరిజనులందరం స్వచ్ఛందంగా తరలి వెళ్దామని రాష్ట్ర ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్ నాయక్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ భవనం వద్ద నిర్వహించిన గిరిజన ప్రజాప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వాలు గిరిజనాలను ఓటు బ్యాంకుగా వాడుకున్నారే తప్ప మన సంక్షేమం కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదన్నారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గిరిజనుల సంక్షేమం కోసం అనేక పథకాలు చేపట్టడమే కాకుండా సంతు సేవాలాల్ భవన నిర్మాణాన్ని చేపట్టడం హర్షణీయమన్నారు. ఎస్టీల,గిరిజనుల కోసం రిజర్వేషన్లు కల్పించడమే కాకుండా గిరిజన బందు ను ప్రవేశపెట్టడం సంతోషకరమైన విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీిఎస్ చైర్మెన్ జక్కిడి జంగారెడ్డి,గిరిజన సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షులు రాంబాబు, టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు కత్తుల లక్ష్మయ్య, వైఎస్ ఎంపీపీ ఆంబోతు రాజు, ఎంపీటీసీ సభ్యులు కరంటోత్ విజయ దశరథ,శివరాత్రి కవిత విద్యాసాగర్, సర్పంచులు దేవీలాల్, గణేష్, పానుగోతు పాండురంగ నాయక్, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ జిల్లా కమిటీ సభ్యులు పానుగోతు బాలునాయక్, మోత్యా తదితరులు పాల్గొన్నారు.