Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భూదాన్‌పోచంపల్లి
వికలాంగుల సంక్షేమం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వస్తోందని ఎన్పీఆర్డీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఉపేందర్ అన్నారు. శుక్రవారం మండడలంలోని జగత్పల్లి, దేశ్‌ముఖ్ గ్రామాల కమిటీల సమావేశంలో ఆయన మాట్లాడారు.ధరల పెరుగుదలకు అనుగుణంగా వికలాంగుల పెన్షన్ 10వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. కాలపరిమితి ముగిసిన వికలాంగులకు సర్టిఫికేట్ పొందినప్పటి నుండి ఎరియర్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షులు సురూపంగా ప్రకాష్ మాట్లాడుతూ. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం అమల్లోకి వచ్చి 6ఎండ్లు అవుతుందని అమలులో మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో జగతిపెల్లి గ్రామ అధ్యక్షులు మర్రి మల్లారెడ్డి ప్రధాన కార్యదర్శి నేదురు మంజుల, కోశాధికారి ముప్పిడి దశరథ, దేశముకి గ్రామ అధ్యక్షులు రాగుల స్వామి, ఉపాధ్యక్షులు ఇస్తారి ప్రధాన కార్యదర్శి వీరశెట్టి రవి, సహాయ కార్యదర్శి కోశాధికారి సునొజు యాదగిరి చారి, గ్రామం అధ్యక్షులు కాసుల మల్లేశం, ఉపాధ్యక్షులు జుర్రు పద్మ, ప్రధాన కార్యదర్శి రాజదేవుల శ్యామల ,సహాయ కార్యదర్శి సుంకు మల్లేశం కోశాధికారి ఆముదాల సుజాత తదితరు పాల్గొన్నారు.