Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
మధ్యాహ్నం భోజనం పథకం కార్మికులకు రూ.2 వేల వేతనం పెంచుతున్నట్టు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించినప్పటికి నేటికీ జీఓ విడుదల కాలేదని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కొలిశెట్టియాదగిరిరావు విమర్శించారు.శుక్రవారం జీఓను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఆ సంఘం ఆధ్వర్యంలో డీఈఓకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు ప్రతి విద్యార్థికి రూ.15 కేటాయించాలని కోరారు. కోడిగుడ్లు ప్రభుత్వమే సప్లరు చేయాలన్నారు. పెండింగ్ బిల్లులు,వేతనాలు వెంటనే విడుదల చేయాలని,కార్మికులకు డ్రెస్‌కోడ్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.వినతిపత్రం అందజేసిన వారిలో మధ్యాహ్న భోజన పథకం కార్మిక నాయకులు కె.వరలక్ష్మీ, చెరుకు యాకలక్ష్మీ, భేగం, జయమ్మ, నాగమణి, తిరుపతమ్మ ఉన్నారు.