Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేతేపల్లి
మూసి ప్రాజెక్టు వద్ద ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దైద రవీందర్ విమర్శించారు. కేతేపల్లి మండలం మూసి ప్రాజెక్టు వద్ద ఉన్న మహాత్మా జ్యోతిరావుపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సంఘం (ఎంజేపీటీఎస్ఆర్సీబీసీ) గురుకుల పాఠశాలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం రవీందర్ సందర్శించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డాక గురుకుల పాఠశాలను నూతన భవన నిర్మాణం పనులు ప్రారంభించి, నిధులు మంజూరు చేయకుండానే అర్ధాంతరంగా నిలిపివేశారని ఆరోపించారు. పాఠశాలలో సరైన వసతులు లేవన్నారు. గురుకుల పాఠశాలలో వసతులను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సురేష్, ఎంపీపీ పేరుమాళ్ళ శేఖర్, మండల అధ్యక్షుడు కంపసాటి శ్రీనివాస్ యాదవ్, ఎన్ఎస్యూఐ నకిరేకల్ ఇంచార్జి అల్లి అంజన్ కుమార్ యాదవ్, యూత్ కాంగ్రెస్ నాయకులు బొడ్డుపల్లి ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.