Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడుచర్ల
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో త్వరలో సూపర్ మార్కెట్ సేవలు ప్రారంభించనున్నట్లు నేరేడుచర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మెన్ దొండపాటి అప్పిరెడ్డి అన్నారు.స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో శుక్రవారం డైరెక్టర్లతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘం ద్వారా అర్హులైన రైతులకు సల్పకాలిక దీర్ఘకాళిక రుణాలు, సంఘం ద్వారా రైతుల ప్రయోజనం కోసమే పురుగు మందుల వ్యాపారం ప్రారంబించామన్నారు.బయట మార్కెట్లో కన్నా సహకార సంఘం ద్వారా రేటు తక్కువ నాణ్యత ఎక్కువ ఉంటుందని చెప్పారు. త్వరలో ప్రారంభించనున్న సూపర్ మార్కెట్ నేరేడుచర్ల పాలకీడు గరిడేపల్లి మండలం ప్రజలకు నాణ్యమైన సరుకులు తక్కువ ధరలకు అందించడం లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్నామని సూపర్ మార్కెట్‌ను ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు. సమావేశానికి సంఘం ఉపాధ్యక్షులు కొప్పుల రాంరెడ్డి, సంఘం పాలకవర్గ సభ్యులు తాళ్ల రామకృష్ణారెడి, పోరెడ్డిపద్మ, దేవులపల్లి శంకరాచారి, తాళ్ల సురేశ్ రెడ్డి, కట్టా సత్యనారాయణరెడ్డి, నూకల వెంకటరెడ్డి, చందమల్ల వెంకన్న, వేముల జయమ్మ, కుసుమ శేఖర్‌రెడ్డి, సపావత్ భీక్యా, సంఘం మాజీ చైర్మెన్ పోరెడ్డి బుచ్చిరెడ్డి, సంఘ పరిధిలోని రైతులు సంఘ సీఈఓ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.