Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేదలకు నూతన పాస్‌బుక్కులు ఇవ్వాలి
- వ్యకాస జిల్లా ప్రధానకార్యదర్శి కొండమడుగు నర్సింహ
నవతెలంగాణ-చౌటుప్పల్
మండలవ్యాప్తంగా 50,60 ఏండ్లుగా ప్రభుత్వ భూములను సాగుచేసుకుంటున్న పేదలందరికి నూతన పట్టా పాస్‌బుక్కులు ఇవ్వకపోవడంతో రైతుబంధు అందడంలేదని, వెంటనే పట్టాలివ్వాలని వ్యవసాయ కార్మికసంఘం జిల్లా ప్రధానకార్యదర్శి కొండమడుగు నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మున్సిపల్ కేంద్రంలోని కందాల రంగారెడ్డి స్మారక భవనంలో ఆ సంఘం మండలకమిటీ సమావేశం మండల అధ్యక్షులు గంగదేవి సైదులు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక మంది పేదలు ఆనాడు ప్రభుత్వాలు ఇచ్చిన భూములను కష్టపడి సాగులోకి తెచ్చుకొని సేద్యం చేసుకుంటున్న పరిస్థితి ఉందన్నారు. వారికి నేటికీ నూతన పట్టా పాసుపుస్తకాలు రాకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వపరంగా వస్తున్న రైతుబంధు, రైతుబీమాలాంటి సౌకర్యాలు కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రభుత్వ భూములను సేద్యం చేసుకుంటున్నపేదలందరికి నూతన పాస్‌పుస్తకాలు ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో ఆ సంఘం మండలకార్యదర్శి బొజ్జ బాలయ్య, జిల్లా కమిటీ సభ్యులు బోయ యాదయ్య, మామిడి స్వరూప, మండలకమిటీ సభ్యులు యాట బాలరాజు, ముత్యాలు, మానె సాలయ్య, పొట్ట వెంకటయ్య, శ్రీనివాస్‌రెడ్డి, జంగం అంజయ్య, చీరిక లక్ష్మమ్మ, రాపోలు పద్మ, శ్రీశైలం పాల్గొన్నారు.
ఉపాధిచట్టాన్ని బలహీన పరుస్తున్న బీజేపీ
చౌటుప్పల్ రూరల్ : పోరాటాలతో సాధించుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలోని బీజేపీసర్కార్ బలహీనపరిచే కుట్ర చేస్తుందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహ ఆరోపించారు. చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో శుక్రవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం గ్రామ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూలీలకు కనీస కూలి రోజుకు 600 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గాయపడిన, చనిపోయిన వారికి ప్రభుత్వపరంగా ఎక్స్‌గ్రేషియా, నష్టపరిహారం, పని ప్రదేశాల్లో మంచినీళ్లు, నీడ కోసం టెంట్, మెడికల్ కిట్టు,పనిముట్లకు ప్రభుత్వము తక్షణమే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం 17 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు. గ్రామ అధ్యక్షులుగా ముద్ద కళ్యాణి, కార్యదర్శిగా మీసాల లింగయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం మండల కార్యదర్శి బొజ్జ బాలయ్య, జిల్లా కమిటీ సభ్యులు బొయ యాదయ్య, మామిడి స్వరూప, గ్రామ నాయకులు అంతటి, రత్నం శ్రీకాంత్, సిద్ధగోని శ్రీకాంత్, రోడ్డ యాదయ్య, ముద్ద కళ్యాణి బొడిగ పద్మ బోయ రాములు మీసాల లింగయ్య నాటి లక్ష్మీబాయి, దబ్బటి అంజయ్య, సుశీల,యాదమ్మ,రమణ, నరసింహ, మారయ్య ,నరసమ్మ, నవనీత, లక్ష్మమ్మ ,యాదయ్య తదితరులు పాల్గొన్నారు.