Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోతె
తాటి చెట్లు నరికిన దోషులపై చట్టరీత్య చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని, వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శనివారం మండలపరిధిలోని రాఘవపురం గ్రామంలో కల్లుగీత కార్మిక సంఘం రెండవ మండల మహాసభ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 29న ఆత్మకూర్ ఎస్ మండలంలోని నెమ్మికల్ దండు మైసమ్మ దేవాలయం సమీపంలోని శుభం ఫంక్షన్హాల్లో జిల్లా రెండవ మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహాసభకు గీత కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.కొత్త సభ్యత్వ కార్డులు,50 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరికి రూ.5 వేల పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గీతబంధువు ద్వారా కార్మికులకు రూ.10 లక్షలు ఇవ్వాలని కోరారు.ప్రతి సొసైటీకి ప్రభుత్వం ఐదెకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు.తాటి ఈత ఉత్పత్తులకేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.సొసైటీకి కమ్యూనిటీ భవనాన్ని నిర్మించాలని కోరారు.మోటార్ బైకులు పంపిణీ చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు జెర్రిపోతుల కృష్ణ,మండల అధ్యక్ష కార్యదర్శులు గుణగంటి వీరస్వామి బట్టిపెళ్లి నాగమల్లయ్య, సంఘం గౌరవ అధ్యక్షులు ప్రకాశం, మండల కమిటీ సభ్యులు కాంపాటి వెంకన్న, జి.వెంకన్న, పంతంగిగోపాల్, ఎం.వెంకన్న, మామిడి వెంకటేశ్వర్లు, అంబాల వీరస్వామి,చిత్తలూరు అంజయ్య, కోల ఉపేందర్, ఎ.నాగరాజు, ఎస్.వెంకన్న, నాగరాజు, సుమన్, రవి, అర్వపల్లి లింగయ్య,అయితగాని వెంకన్న,అండం వెంకన్న, పాల్గొన్నారు.