Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్లో పెరుగుతున్న చేరికలు
- రాజ్యసభ సభ్యులు బడుగు లింగయ్య
నవతెలంగాణ-మర్రిగూడ
టిఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని రాజ్యసభ సభ్యులు బడుగు లింగయ్య యాదవ్ అన్నారు. మర్రిగూడ మండల కేంద్రంలో టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తోటకూరి శంకర్ అధ్యక్షతన శనివారం టీఆర్ఎస్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం, వనభోజన కార్యక్రమం కళాకారుల నృత్యాలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. మునుగోడు టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ కుంట్ల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో తిరుగండ్లపల్లి, ఖుద బక్షపల్లి అజ్జలపురం గ్రామాల ఇతర పార్టీల నుండి భారీ ఎత్తున ప్రజలు టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాజ్యసభ సభ్యులు బడుగు లింగయ్య యాదవ్ హాజరై మాట్లాడారు. 2014కూసుకుంట్ల ప్రభాకర్ శాసనసభ్యులుగా ఉన్నప్పుడు మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి పనులు శరవేగంగా జరిగినవని 2018 ఎలక్షన్లో గెలుపొందిన కాంగ్రెస్ శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదన్నారు. మునుగోడులో కుంటుపడిన అభివృద్ధి మరల పునర్నిర్మాణం కావాలంటే మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ 2014లో తను శాసనసభ్యునిగా తను ఉన్నప్పుడు 500 నుండి 600 కోట్ల నిధులతో పలు అభివద్ధి కార్యక్రమాలు చేపట్టానని, రెండువేల కోట్ల నిధులు చర్లగూడెం రిజర్వాయర్‌కు మంజూరు చేపించానని తెలిపారు. ఎనిమిది టిఎంసిల లక్ష్మణపురం రిజర్వాయర్‌కు నిధులు తెప్పించానన్నారు. బిజెప,ి కాంగ్రెస్ రెండు ప్రతిపక్ష పార్టీలేనని ఒకవేళ బిజెపి శాసనసభ్యులు మునుగోడు ఉప ఎన్నికలో గెలిస్తే ఏ విధంగా అభివద్ధి చేస్తా డో చెప్పాలన్నారు. తాను మునుగోడు బిడ్డనని మాగి ముంతలేని మన నియోజవర్గం కానీ వ్యక్తిని గెలిపిస్తే తనకు మన నియోజవర్గం పైన ఏ విధంగా ప్రేమ ఉంటుందో ప్రజలే తేల్చుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో భువనగిరి శాసనసభ్యులు, మర్రిగూడ మండల ఇంచార్జ్ పైల శేఖర్ రెడ్డి, టిఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షులు, శాసనసభ్యులు రవీందర్ కుమార్, ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు, గొల్ల కురుమల సంఘం అధ్యక్షులు అయోధ్య, మండల ఎంపీపీ మెండు మోహన్ రెడ్డి, మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ దండు జగదీశ్వర్, జడ్పిటిసి పాశం సురేందర్ రెడ్డి, బంధు జిల్లా డైరెక్టర్ లపంగి నరసింహ, టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి అయితగోని వెంకటయ్య, పలు గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, గ్రామ శాఖ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.