Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్
నవతెలంగాణ-చౌటుప్పల్
రాష్ట్రంలో బీఎస్పీ అధికారంలోకి వస్తే నెలకు పది లక్షల సంపాదన వచ్చేలా చేస్తామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్ తెలిపారు.ఆదివారం పట్టణకేంద్రంతోపాటు తంగడపల్లి గ్రామంలో బహుజన రాజ్యాధికార యాత్ర కొనసాగింది.ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి పంపిణీచేస్తామన్నారు.బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణాల్లోని పేదలు కూడా బహుజనులేనని తెలిపారు.మునుగోడు ఉపఎన్నికల్లో ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోవాలి కానీ ఓటు మాత్రం బీఎస్పీకి వేయాలని కోరారు.మునుగోడు గడ్డపై బీఎస్పీ జెండా ఎగురవేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు పల్లె లింగస్వామి, కత్తుల పరమేశ్, పద్మ, ముస్కు నర్సింహా, సుభాశ్, అర్జున్, శ్రీనివాస్, బుగ్గరాములు, సుధ, సంతోష పాల్గొన్నారు.