Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అనంతగిరి
రైతులు పండించే పంటలకు గిట్టుబాటు దక్కేలా కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర చట్టం చేయాలని తెలంగాణ రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు బుర్రి శ్రీరాములు డిమాండ్ చేశారు.ఆదివారం మండలంలోని గొండ్రియాల గ్రామంలో లక్ష్మణ్‌రావు అధ్యక్షతన మండలమహాసభ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అన్యాయం చేస్తున్నాయన్నారు.ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక విస్మరించిందన్నారు.నిత్యావసర వస్తువులపై జీఎస్టీ పన్ను విధించడం వల్ల సామాన్యులపై ఆర్థికభారం పెరిగిందన్నారు.కార్పొరేట్ కంపెనీ లకు లక్షల కోట్ల రాయితీలిస్తున్న కేంద్రం ప్రతిదానిపై జీఎస్టీని విధించడం అన్యాయమన్నారు.అనంతరం రైతుసంఘం నూతన గ్రామఅధ్యక్షులుగా బట్ట లింగయ్య, కార్యదర్శిగా జుట్టుకొండ వీరయ్యలను ఎన్నుకున్నారు.వీరితో పాటు ఏడుగురు కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా నియమించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి రాపోలు సూర్యనారాయణ, కౌలు రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్కె.సైదా, జిల్లా కమిటీ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, మన్నే వెంకటయ్య,సురభి లక్ష్మీ పాల్గొన్నారు.