Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వవిప్ గొంగిడి సునీతామహేందర్ రెడ్డి
నవతెలంగాణ - ఆలేరుటౌన్
తెలంగాణ రాష్ట్రానికి విశ్వవ్యాప్తంగా బతుకమ్మ పండుగ ఖ్యాతి తీసుకొచ్చిందని ప్రభుత్వ విప్, ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. సోమవారం అసెంబ్లీ ఆవరణలో మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ సంబురాల్లో పాల్గొని ఆడిపాడారు. ఈ సందర్భంగా ఆమె తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మను రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో ,పూల పండుగకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కిందని చెప్పారు . శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి , అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచారి తదితరులు పాల్గొని బతుకమ్మ వేడుకలను తిలకించారు.
ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం
తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకమని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డి అన్నారు. సోమవారం జయంతి సందర్భంగా ఆమె ఒక ప్రకటనను విడుదల చేశారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన తెగువ, పౌరుషం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పిందని గుర్తు చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. ఆమె ఆశయాల సాధనే లక్ష్యంగా పేద, బలహీనవర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ పాటుపడుతున్నారని విప్ సునీతామహేందర్ రెడ్డి తెలిపారు.