Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరి రూరల్
కనీస వేతనాలు జీవోలను వెంటనే అమలు చేయాలని కోరుతూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి దాసరి పాండు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఇమ్రాన్ మాట్లాడుతూ 73 షెడ్యూల్ సంస్థలు పెట్రోల్ బంకు హాస్పిటల్స్ , ఫైనాన్స్ , సినిమా హాల్స్ , చిట్ ఫండ్స్ ,గ్యాస్ ఏజెన్సీ , షాపింగ్ మాల్స్, షోరూమ్స్, హోటల్స్ అండ్ రెస్టారెంట్ ,షాప్స్, పరిశ్రమలు తదితర సంస్థల్లో ఏళ్ల తరబడిగా పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు చెల్లించడంలేదన్నారు. యాజమాన్యాలు శ్రమదోపిడీి చేస్తున్నాయని అన్నారు. కనీస వేతనాల 5 జీవోలకు ఫైనల్ నోటిఫికేషన్ పూర్తి అయిన గెజిట్ చేయకుండా కాలయాపన చేస్తూ ప్రభుత్వం యాజమాన్యాలకు తలొగ్గి వారి ప్రయోజనాల కోసం ఆలోచిస్తోందని విమర్శించారు. జీ వోలకు గెజిట్ చేసి కనీస వేతనాలు చెల్లించాలని, కార్మిక చట్టాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కోమటి రెడ్డి చంద్రారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కల్లూరి మల్లేశం, నాయకులు సోమయ్య, వెంకటేశం, మంచాల మధు, గణేష్, స్వామి, వెంకటేష్, సత్తయ్య లు పాల్గొన్నారు.