Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
రాత్రి సమయంలో అతివేగంగా బైకులను నడుపుతూ ఇతరులకు ఇబ్బందులు కలిగించే యువకులపై కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని నల్లగొండ టూటౌన్ ఎస్ఐ రాజశేఖర్రెడ్డి హెచ్చరించారు. సోమవారం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో వాహనదారులకు అవగాహన కల్పించి మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని కొంతమంది తల్లిదండ్రులు రాత్రి సమయంలో మైనర్లకు ద్విచక్రవాహనాలను ఇస్తున్నారని, వారు రద్ది ప్రదేశాల్లోకి వచ్చి అతివేగంగా బైక్ రైడింగ్ చేస్తూ ప్రమాదాలకు కారణమవుతూ, సామాన్యులను భయాబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. మైనర్లకు బైకులు ఇస్తున్న తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత రెండు రోజులుగా ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న యువకులపై నిఘావేసి పట్టుకుని చాలాన్లు విధించి, కౌన్సెలింగ్ ఇచ్చామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.