Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హామీ అమలు కాకుంటే మళ్లీ సమ్మె
- సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరారెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
జిల్లా కేంద్ర ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల టెండర్ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని జరుగుతున్న సమ్మె జాయింట్ కలెక్టర్ హామీతో తాత్కాలికంగా విరమిస్తున్నట్టు సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్ర హాస్పిటల్ ముందు కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె శిబిరం రెండో రోజు కొనసాగింది. సమ్మె శిబిరానికి హాజరైన వీరారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నుండి టెండర్లు పూర్తిచేసి కనీస వేతనం రూ.15,600 ఇవ్వాలని ఉత్తర్వులు వచ్చినప్పటికీ నల్లగొండ ఏరియా హాస్పిటల్ అన్ని పూర్తయిన జిల్లా కేంద్ర హాస్పిటల్ టెండర్లు పూర్తి చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. అక్టోబర్ రెండో వారం నాటికి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి కనీస వేతనం అమలు జరగకపోతే యధావిధిగా సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. సమ్మె విరమణ తాత్కాలికమేనని, జాప్యం జరిగితే మళ్లీ సమ్మె తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయూ నల్లగొండ యూనిట్ అధ్యక్షులు మునగ వెంకన్న, ప్రధాన కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, కార్యదర్శి చిన్నబోస్క నరేష్, కోశాధికారి మారం నాగమణి, ఉపాధ్యక్షులు పర్వతం రామయ్య, సహాయ కార్యదర్శులు కందుల అండాలు, వలికి లలిత, అంబటి కృష్ణ, అజీమ్, నవీన్, జ్యోతి, అరుణ, లక్ష్మమ్మ, జానమ్మ, నాగయ్య, తదితరులు పాల్గొన్నారు.