Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలగిరి
అర్హత లేకుండా ఆస్పత్రిలో వైద్యం చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని డిప్యూటీ డీఎంహెచ్ఓ కల్యాణ్‌చక్రవర్తి చెప్పారు.బుధవారం మండలకేంద్రంలోని ప్రయివేట్ ఆస్పత్రులను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఆసుపత్రిలో అర్హత కలిగిన డాక్టర్లు, ట్రైనీ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు తప్పకుండా ఉండాలని చెప్పారు.గ్రామీణవైద్యులు రోగులకు సూది మంది, సెలైన్ బాటిల్లు ఇవ్వకూడదని హెచ్చరించారు.రోగులకు పలుమందులు తీసుకోవాలని సూచించే అర్హత వీరికి లేదని తెలిపారు.ఆస్పుత్రులు ఏర్పాటు చేసుకోవాలనుకునే డాక్టర్లు, బోర్డులు, ప్రిస్క్రిప్షన్ లెటర్స్ పై తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన సర్టిఫికెట్ ప్రకారమే తమ అర్హతను ముద్రించాలని తెలిపారు.స్వాతి ఆస్పత్రిలో అర్హత కలిగిన నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్ లేకుండా, నిబంధనలను పట్టించుకోని ఆస్పత్రి యజమానికి నోటీసులు జారీ చేశామన్నారు. ఈ ఆసుపత్రిలో డాక్టర్ అర్హతకు మించి ఎం డి ఫిజీషియన్ అని ఏర్పాటు చేసుకోవడం నేరమన్నారు.వెంటనే మార్చుకోవాలని లేని యెడల వారిపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.మెట్రో ఆసుపత్రిలో అర్హత లేని డాక్టర్లచేత వైద్య చేస్తున్నారని సమాచారం ఉందని మళ్లీ ఇలాంటివి జరిగితే తదుపరి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్పారు.నిబంధనలకు విరుద్ధంగా ఆస్పత్రులు ఏర్పాటు చేసుకున్న ఆర్ఎంపీలు వారి ఆస్పత్రికి తాళం వేసి పరారయ్యారన్నారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డీఎంహెచ్ఓ హర్షవర్ధన్, తిరుమలగిరి డాక్టర్ ప్రశాంత్‌బాబు,సీహెచ్ఓ బిచ్చునాయక్, యాదగిరి పాల్గొన్నారు.