Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసుల అదుపులో నిందితుడు
- కారు స్వాధీనం
- డీఎస్పీ నాగభూషణం
నవతెలంగాణ-సూర్యాపేట
పట్టణంలో 9 కేజీల గంజాయిని, ఒక్కర్ని అరెస్టు చేసి, కారును స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ నాగభూషణం తెలిపారు.మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఆయన వివరాలు వెల్లడించారు. ఖమ్మం క్రాస్‌రోడ్‌లో పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తున్న క్రమంలో ఒక కారు ఆపి చెక్ చేసేందుకు వెళ్లగా కారు డ్రైవర్ పాత నేరస్తుడు కావడంతో కారులో తనిఖీలు నిర్వహించగా 9 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో నివాసముంటున్న జాదవి ఉపేందర్ పెయింటర్ వృత్తి చేసుకుంటూ గతంలోనూ గంజాయి కేసుల్లో జైలుశిక్ష అనుభవించి వచ్చి మరల గంజాయి కేసుల్లో పట్టుపడ్డాడు.గంజాయిని విశాఖపట్నం తదితర ప్రాంతాల నుండి తీసుకొచ్చి మిర్యాలగూడ, నార్కట్‌పల్లి, నకిరేకల్‌లో గంజాయి తాగే వారికి ఎక్కువధరకు అమ్మి సులభంగా డబ్బులు సంపాదిస్తూ, ఆ డబ్బుతో ఒక సెకండ్‌హ్యాండ్ కారు కూడా కొన్నాడు.అదేవిధంగా సీలేరు నుండి తొమ్మిది కేజీల గంజాయిని కొనుగోలు చేసి అతని కారులో తీసుకొని వస్తూ పట్టుబడ్డాడు. పట్టణ సీఐ రాజశేఖర్, సీఐ గౌరీ నాయుడు, ఎస్సై మహేందర్ నాథ్, పట్టణ ఎస్సై లు శ్రీనివాస్, యస్.కే యాకూబ్, హెడ్ కానిస్టేబుల్ కృష్ణ, కర్ణాకర్, వెంకన్న, శ్రీనివాస్, గురు స్వామి, కానిస్టేబుల్ సైదులు, ఆనంద్, మధులను సూర్యపేట డీఎస్పీ నాగభూషణం అభినందించారు.