Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొండమల్లేపల్లి
గ్రామంలోని ప్రతిఒక్కరూ విధిగా కంటి పరీక్షలు చేయించుకోవాలని సర్పంచ్ గడ్డం శ్రీరాములు అన్నారు.మంగళవారం మండలపరిధిలోని చిన్నఅడిశర్లపల్లి గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు.శిబిరంలో కంటిపరీక్షలు చేయించుకుని అవసరమున్న వారు కళ్లద్దాలు తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సలహాదారుడు పసునూరి యుగంధర్‌రెడ్డి, ఉపసర్పంచ్ మంగ్యానాయక్, రావుల వెంకటయ్య, సత్యనారాయణ, జి.వెంకటయ్య, డాక్టర్ రసూల్, పి.శ్రీను, బద్రి, ఆంజనేయులు, చందునాయక్, ఆశావర్కర్లు,వైద్యారోగ్య సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.