Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరసనగా గ్రామస్తులు కబ్జాకు యత్నం
- గ్రామపంచాయతీ కార్యాలయానికి తాళం
- ఐలాపురంలో ఉద్రిక్త పరిస్థితులు
నవతెలంగాణ-మిర్యాలగూడ
మిర్యాలగూడ మండలంలోని ఐలాపురం చెరువు శిఖం భూములను కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో కబ్జాకు నిరసిస్తూ తాము కూడా నిరుపేదలమేనని తాము కూడా కబ్జా చేస్తామంటూ చెరువు శిఖం భూములను కబ్జా చేసేందుకు యత్నించారు.ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు.దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.మిర్యాలగూడ మండలంలోని ఐలాపురం గ్రామంలో సర్వేనెంబర్ 85లో చెరువు ఉన్నది.దానికి ఆనుకొని గ్రామ సరిహద్దులో ఉన్న భూమి సర్వే నెంబర్ 15లో ఉన్నదని, ఆ భూమి తమ వారసత్వంగా వచ్చిందని గ్రామానికి చెందిన కొందరు భూమిని చదును చేశారు.చెరువు చివరిలో ఉన్న చెట్లను తొలగించి అందులో మట్టితో చదును చేశారు.సుమారు ఎకరానికి పైగా కబ్జా చేసి వారం రోజుల నుండి చదును చేస్తుండడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.మంగళవారం గ్రామ పంచాయతీ గేటుకు తాళం వేసి నిరసన తెలిపారు.చెరువుశిఖం భూములోనే గ్రామపంచాయతీ భవనం, వాటర్‌ట్యాంక్ నిర్మాణం చేశారని కబ్జా చేసిన భూమి కూడా చెరువు శిఖందేనని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.ఈ విషయంపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో తాము కూడా నిరుపేదల మేనని ఉండడానికి ఇండ్లు లేదని, శిఖం శివారులో ఉన్న భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.మట్టి పోసి చదును చేస్తున్నారు.
కలెక్టర్‌కు ఫిర్యాదు:గ్రామంలో చెరువు శిఖం భూముల కబ్జాపై గ్రామస్తులు కలెక్టర్‌కు వినరుకృష్ణారెడ్డికి ఫిర్యాదు చేశారు.భూమి చదును చేస్తున్న దృశ్యాలు, గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం, గ్రామస్తుల ఆందోళన వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.కొందరు గ్రామస్తులు కలెక్టర్‌కు నేరుగా ఫోన్ చేసి కబ్జా చేస్తున్న విషయాన్ని ఫిర్యాదు చేశారు.దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.గ్రామస్తులు వర్గాలుగా విడిపోయి కబ్జాలపై ఆందోళన చేస్తున్నారు.కానీ రెవెన్యూ అధికారులు మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు.