Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
ఆలేరు మున్సిపల్ చైర్మెన్ వస్పరి శంకరయ్య పై అదే అధికారాన్ని బీఆర్ఎస్కు చెందిన కౌన్సిలర్లతోపాటు ఒక ఇండిపెండెంట్ మరొక కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ పురపాలక సంఘం చైర్మెన్‌్ వస్పరి శంకరయ్య ఒంటెద్ది పోకడలు పోతున్నాడని ఆరోపిస్తూ పదిమంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాన్ని కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు. గతంలో సైతం పలుమార్లు బాహాటంగానే మున్సిపల్ చైర్మెన్వైఖరిపై, వైస్ చైర్మెన్‌తో పాటు వ్యతిరేకంగా గళం విప్పినప్పటికీ రాష్ట్రప్రభుత్వ విప్ స్థానిక శాసన సభ్యురాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి కలగజేసుకొని కౌన్సిలర్లను భుజ్జగించారు. మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించలేక అధికార పార్టీ ఆడుతున్న కొత్త నాటకం అని, అభివృద్ధి చేయడంలో పోటీ పడాల్సిన పాలకవర్గం మున్సిపాలిటీకి వచ్చే ఆదాయాన్ని ఎలా పంచుకోవాలో ఆలోచన చేస్తున్నారని అభివృద్ధికి కృషిచేసిపట్టణ అభివృద్ధిలో పురోగతి సాధించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. కౌన్సిలర్లను అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు సీనియర్ నాయకులు కలెక్టరేట్‌కు వెళ్లి పూజగించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అభివృద్ధిలో పోటీ పడాల్సిన కౌన్సిలర్లు రెండోసారి అవిశ్వాస తీర్మానం చేపట్టేందుకు ప్రయత్నాలు చేపట్టడంపై పట్టణ ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఆలేరు మున్సిపాలిటీలో చైర్మన్ వస్పరి శంకరయ్య పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే విషయమై అసంతృప్తులు గత కొంతకాలంగా అంతర్గత చర్చలు నిర్వహించారు. ఒక పది రోజుల నుండి గుట్టు చప్పుడు కాకుండా క్యాంపు రాజకీయాల నడిపినట్లు తెలుస్తుంది. గతంలో సైతం అవిశ్వాసంపై తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వ వింగిడి సునీత మహేందర్ రెడ్డి దగ్గరుండి భుజగించడంతో సద్దుమణిగింది. మున్సిపాలిటీలో పన్నెండు మంది కౌన్సిలర్లకు గాను, ఇండిపెండెంట్ ఒకరు, కాంగ్రెస్ ఒకరు, బీజేపీి ఒకరు, 9 మంది బీఆర్ఎస్ పార్టీకి చెందినవారు ఉన్నారు. మున్సిపల్ చైర్మెన్ శంకరయ్యతో సఖ్యతగా ఉంటూనే మీ తతాంగం పొందని నడిపిస్తున్నారని గుసగుసలను వినిపిస్తున్నాయి. జగిత్యాల ,తాండూరు ,వికారాబాద్ సరసన అవిశ్వాసంతో,ఆలేరు ,యాదగిరిగుట్ట మున్సిపాలిటీలు చేరాయని రాజకీయ విశ్లేషకులు చర్చిస్తున్నారు.