Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -మోత్కూర్
ప్రజల హక్కులకు భంగం కలగకుండా రాజ్యాంగం కల్పించిన పౌర హక్కులను కాపాడాలని జిల్లా ఎస్సి, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ దాసరి తిరుమలేష్ కోరారు. మోత్కూర్ మండలం అనాజీపురం గ్రామంలో మంగళవారం పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతి, మతం, కులం, లింగం భేదం లేకుండా పౌర హక్కులను కాపాడాలన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ షేక్ అహ్మద్, ఎంపీడీవో పి. మనోహర్ రెడ్డి, సర్పంచ్ ఉప్పల లక్ష్మీ యాదయ్య, ఆర్ఐ శ్రీనివాస్, ఎస్సి హాస్టల్ వార్డెన్ ప్రసన్న, చుక్క వెంకన్న, బర్రె కిష్టయ్య, మాతంగి నర్సయ్య, బర్రె సత్తయ్య, నల్ల రామచంద్రు, మాతంగి నరేష్, బర్రె పాపయ్య, నల్ల ముత్తయ్య, పొట్టేపాక లక్ష్మి, మాతంగి ఆగయ్య తదితరులు పాల్గొన్నారు.