Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ విప్ గొంగిడి సునీతమహేందర్రెడ్డి
నవతెలంగాణ -ఆలేరురూరల్
నిరుపేద కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు వరం లాంటిదని ఆలేరు శాసన సభ్యురాలు ప్రభుత్వ విప్పు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు .మంగళవారం ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మాట్లాడుతూ గ్రామానికి 64 ఇండ్లు మంజూరు కావడం నిర్మాణం పూర్తి చేయడంతో గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబాలు సంతోషంగా ఉన్నారన్నారు. సీఎం కేసీఆర్ నిరుపేదల పట్ల ఆపద్బాంధవుడు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి ,మండల ఎంపీపీ అశోక్ ,గ్రామ సర్పంచ్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి ,ఉప సర్పంచ్ అనిత అంజయ్య ,తాసిల్దార్ రామకృష్ణ, మండల పార్టీ అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ ,గ్రామ శాఖ అధ్యక్షుడు జంగస్వామి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నర్సింలు, పిఎసిఎస్ డైరెక్టర్ మల్లేష్, నర్సింలు మాజీ ఎంపీపీ అనసూయ ,మాజీ ఎంపీటీసీ బొంకూరి భాగ్యలక్ష్మి ,వార్డు సభ్యులు తోడేటి నరేందర్ ,జంగ పరశురాములు ,గుర్రాల బాలరాజు,నాయకులు పాల్గొన్నారు.