Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
చదువుతోపాటు హక్కుల సాధన కోసం విద్యార్థులు పోరాటాలు నిర్వహించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వనం రాజు అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం విఆర్ కళాశాల ఆవరణలో సంక్రాంతి పండగ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులంత ప్రశ్నించేతత్వాని అలవర్చుకోని చదువు పోరాటల సమ్మేళనంతో ముందుకు సాగాలన్నారు. విద్యార్థులు సమాజంలో మార్పు చెందించే దిశగా ప్రయాణం కొనసాగించాలని,దేశ భవిష్యత్తు విద్యార్థుల పైన ఆధారపడిన ఉండానిన్నారు.అందుకే లక్ష్య సాధనలో ముందు ఉండి సాధించుకోవాలనిన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి కాసుల నరేష్,మండల ఉపాధ్యక్షులు కంతి విక్రమ్, రాజేందర్, మాదాని నవీన్,పాషికంటి ఉదరు పాల్గొన్నారు.