Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కిరోసిన్ డబ్బాతో నిరసన
నవతెలంగాణ -ఆలేరురూరల్
ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో అర్హులైన పేదవారికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు పంపిణీ చేయకుండా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారికి ఎంపిక చేశారని సమాచారం తెలవడంతో మంగళవారం ఆలేరు చేర్యాల రహదారిపై కిరోసిన్ డబ్బాతో గ్రామస్తుడు కోకల యాదగిరి వంటిపై కిరోసిన్ పోసుకొని నిరసన వ్యక్తం చేసాడు. గమనించిన పోలీసులు కిరోసిన్ డబ్బా గుంజుకొని ప్రాణాలు కాపాడారు. కాంగ్రెస్, బీజేపీ ఆధ్వర్యంలో సుమారు 200 మంది రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. సమాచారం లేకుండా తహసీల్దార్ డ్రా చేయడం సరైనది కాదు అని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. 2:30 గంటల సమయంలో ప్రభుత్వం గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ప్రారంభోత్సవానికి వస్తున్న సమయంలో వారిని కూడా అడ్డుకున్నారు. పోలీసులకు, గ్రామస్తులకు మధ్యన తోపులాట జరగడంతో పోలీసులు శాంతి చేయాల్సింది పోయి వారితో వాగ్వాదానికి దిగారు. గ్రామస్తులు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న శిలాఫలకానికి కట్టిన బ్యానర్‌ను తొలగించారు .టెంటు కూర్చీలు వేశారు. కుర్చీలు విరగొట్టారు. అంతటితో ఆగకుండా స్టేజి మీద విధ్వంసం సృష్టించారు. 115 మంది లబ్దిదారులు డబుల్ బెడ్ రూమ్ ల కోసం అప్లై చేసుకోగా 64 డబుల్ బెడ్ రూంఇండ్లు డ్రా సిస్టం ద్వారా ఎంపిక చేయమని చెప్పడంతో వాటిని లెక్కచేయకుండా కేవలం బీఆర్ఎస్ నాయకులకు అందజేస్తున్నారని స్థానిక ఎంపీపీ ఆరోపించారు. ఇల్లు భూమి లేని వారు 17 మంది ఉన్నారని వారిని కూడా గుర్తించి న్యాయం చేయాలని కోరారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత మాట్లాడుతూ అర్హులైన వారిని గుర్తించి వారికి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. దీంతో గొడవ సద్దుమణిగింది. నిరసన వ్యక్తం చేసిన వారిలో ఎంపీపీ గంధ మల్ల అశోక్, మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వరరాజు, గ్రామ శాఖ అధ్యక్షుడు విజేందర్ రెడ్డి ,ప్రధాన కార్యదర్శి చాడ రాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ ,నాయకులు కాటంరాజు, భాస్కర్ మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు.