Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ -భువనగిరిరూరల్
జంతు సంరక్షణపై విద్యార్థి దశ నుండే అవగాహన కలిగి వుండాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మంగళవారం జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జంతు సంక్షేమ పక్షోత్సవంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, కెబిజివి విద్యార్థ్ధినులకు నిర్వహించిన చిత్రలేఖనం, వ్యాస రచన, వక్తృత్వ పోటీలలో గెలుపొందిన వారికి మంగళవారం కలెక్టరేటు మీటింగ్ హాలులో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జంతువుల పట్ల ప్రతి ఒక్కరూ కరుణ, ప్రేమ కలిగి వుండాలని, జంతు సంరక్షణ పట్ల ఏర్పాటు చేసిన చట్టాలపై అవగాహన కలిగి వుండాలని, ముఖ్యంగా విద్యార్ధి దశ నుండే జంతు సంరక్షణ పట్ల అవగాహన కలిగించడానికి జిల్లాలో 185 ప్రభుత్వ పాఠశాలల్లో కరుణ క్లబ్స్ ఏర్పాటు చేసి విద్యార్దులలో ప్రతి క్లబ్ నుండి ఉత్సాహవంతులైన వారిని ఛైల్డ్ అంబాసిడర్ గా ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. మనుషులు జంతువుల మధ్య అనుబంధం తెలిపే ''ఛార్లీ 777'' చలన చిత్రాన్ని సమావేశ మందిరంలో విద్యార్థులకు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా పశు సంవర్ధక అధికారి డాక్టర్ కృష్ణ, జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరెడ్డి, రాష్ట్ర జీవ జంతు కారుణ్య మండలి సభ్యులు మహేశ్ అగర్వాల్, తెలంగాణ గోశాల మండలి సభ్యులు రోజా, పశు సంవర్ధక శాఖ సహాయక సంచాలకులు డాక్టర్ ఐలయ్య, డాక్టర్ గోపిరెడ్డి, డాక్టర్ పండిట్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.